|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రంలో శ్రీశ్రీశ్రీ పెద్దిరాజు సహిత పెద్దమ్మతల్లి 26వ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

ఆలయ కమిటీ సభ్యుల నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఇంటింటి బోనాలను సేకరించి వీధి వీధి ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్లారు. శివసత్తుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముదిరాజ్ కుల సభ్యులతో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి తమ భక్తిని వ్యక్తం చేశారు. ధర్పల్లిలో జరిగిన ఈ బోనాల సంబరాలు భక్తుల హర్షధ్వానాలతో మార్మోగాయి.








