ధర్పల్లి : హోలీ సంబరాలు – సన్ సైన్ స్కూల్ విద్యార్థుల ఆనందోత్సాహం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని సన్ సైన్ స్కూల్ లో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించబడాయి.
ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
స్కూల్ కరస్పాండెంట్ ఇంజాపూర్ మహేందర్, మాట్లాడుతూ, “విద్యార్థులకు విద్యతో పాటు పండుగల పట్ల అవగాహన కల్పించడం మా పాఠశాల ప్రధాన అంశాలలో ఓ భాగమని” తెలిపారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా విద్యార్థులు హానికరమైన కెమికల్ రంగులు వాడకుండా, సహజసిద్ధమైన రంగులతో హోలీ వేడుకలను ఆనందంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ శిరీష, మేనేజింగ్ డైరెక్టర్ గంగరాజుల సుమలత, ఉపాధ్యాయులు దివ్య, నవనీత, జయసుధ, వైష్ణవి, రాగిణి, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఆటపాటలతో హోలీ సంబరాలను జరుపుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Join WhatsApp

Join Now

Leave a Comment