ధర్పల్లి ఎస్సైకి సితాయిపేట్ యువత ఆధరాభిమానంతో సన్మానం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి పోలీస్ స్టేషన్‌కు నూతనంగా నియామకం అయిన ఎస్సై కళ్యాణిని సితాయిపేట్ యువ నాయకులు ఘనంగా సన్మానించారు. శాలువాతో సత్కరించిన యువతకు ఎస్సై కళ్యాణి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే వినాయక చవితి, దేవీ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలన్నారు. డీజే వినోదాలు నివారించాల్సిన అవసరముందని, మద్యం సేవకు దూరంగా ఉండాలని, ఎలాంటి గొడవలు జరగకుండా సమాజ శాంతికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.

చట్ట ఉల్లంఘనకు కేసులు తప్పవని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో యువ నాయకులు జంగేటి చంద్రకాంత్, యోగి పటేల్, పిట్ల అరవింద్, సుంచ రాకేష్, ఇందాపురం సాయి తేజ, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment