ధర్పల్లి : బాల్య వివాహ్ మూక్త్ అవగాహన కార్యక్రమం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రంలో గల కేజీవీబీ బాలికల పాఠశాలలో బుధవారం బాల్య వివాహాలను నిరోధించడంపై అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఐసిడిఎస్ (ఇంటిగ్రేటెడ్ చిల్డ్రన్ డెవలప్‌మెంట్ సర్వీసెస్) మరియు ఆర్ సి హెచ్ డి (రీజినల్ చైల్డ్ హెల్త్ డెవలప్‌మెంట్) సంయుక్తంగా నిర్వహించాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక తాహసిల్దార్ మాలతి, ఎంపీడీవో బాలకృష్ణ, ఎస్సై రామకృష్ణ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మౌనిక మరియు ఇతర అధికారులు విచ్చేసి ముఖ్యమైన ప్రసంగాలు చేశారు.

ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ సరిత మాట్లాడుతూ, బాల్య వివాహాలు ఒక పెద్ద సామాజిక సమస్య అని పిల్లల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తు అభివృద్ధి మరియు సామాజిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి అని ఇది చట్టరీత్యా నేరమని, ఈ విధంగా జరిగే వివాహాలు అంగీకరించకూడదు అని, ఎవరైనా బాల్య వివాహాలు చెయ్యాలని చూస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి అని తెలిపారు.

తాహసిల్దార్ మాలతి, ఎంపీడీవో బాలకృష్ణ, ఎస్సై రామకృష్ణ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మౌనిక, ఆర్ సి హెచ్ డి సూపర్వైజర్ జి సోనీ, ప్రిన్సిపల్ సుమలత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment