|| దృశ్యం న్యూస్ ||
మోస్ట్ బ్యాక్ వర్డ్ షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి మఠపతి నాగయ్య స్వామి, MBSC హక్కుల పోరాటం తరపున అందరిని ఆహ్వానిస్తున్నారు, 21-10-2024న, ఉదయం 10:00 నుండి 5:00 వరకు, హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ లోయర్ ట్యాంక్ బాండ్ వద్ద భారీ ధర్నా నిర్వహించబోతున్నాట్లు,
ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సమర్థనగా, ప్రత్యేకించి SC కులగణన విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై దృష్టి సారించాలని. ముఖ్యంగా 60 రోజుల్లో SC వర్గీకరణకు సంబంధించి రిటైర్డ్ హైకోర్టు జడ్జి మోమిన్ అక్తర్ కింద ఏర్పాటు చేసిన కమిటీకి సీఎం ఎనుముల రేవంత్ రేడ్డి కి కృతజ్ఞతలు తెలియజేసారు, 2011 జనాభా లెక్కల ఆధారంగా కాకుండా తాజ SC కులగణన లెక్కల ప్రకారం సరిగ్గా మార్గనిర్దేశం చేయాలని ఈ పోరాట సమితి డిమాండ్ చేస్తోంది.
SC కులాల హక్కులను సురక్షితం చేసేందుకు ఈ ధర్నా కీలకమైనది. RDOల ద్వారా కాకుండా, MROల ద్వారా సంబంధిత లెక్కలపై అర్హతలు లేకుండా తక్షణమే స్థలవిచారణ జరిపి సర్టిఫికేట్లు జారీ చేయాలని వారు కోరుతున్నారు. ఈ విషయమై అధిక శ్రేణి ప్రజలు, ప్రత్యేకించి MBSC కు చెందిన వ్యక్తులు, ఈ పోరాటంలో పాల్గొనడం ద్వారా తమ హక్కులను పరిరక్షించుకునేందుకు ముందు నుంచే సిద్ధం అవ్వాలని చెప్పారు.
ధర్నాలో పాల్గొనడానికి అని వర్గాల ప్రజలు ప్రతి ఒక్కరు అధికసంఖ్యలో హాజరై ఈ పోరాటాన్ని విజయవంతం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేసారు. ఈ ధర్నా ద్వారా MBSC హక్కుల సాధనలో కీలకమైన మార్పులు రావాలని, ఈ పోరాటంలో అందరికి మద్దతు ఇవ్వాలని పిలుపునిస్తున్న మఠపతి నాగయ్య స్వామి కోరారు.










