అష్టముఖీ పుష్కరిణిలో అశుభ్రమైన నీరు – అధికారులపై అసహనం వ్యక్తం చేసిన భక్తులు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, జానకంపేట్ గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద ఉన్న అష్టముఖీ పుష్కరిణి (కోనేరు)లోని నీరు అశుభ్రంగా ఉండటంతో భక్తులకి తీవ్ర అసంతృప్తిని కలిగించింది. ఆలయ నిర్వాహకులు శుభ్రత పట్ల నిర్లక్ష్యం చూపడంతో కోనేరులో నీరు మురికిగా మరి స్నానం ఆచరించే భక్తులకు దుర్వాసన రావడం వల్ల తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

గత శనివారం అమావాస్య సందర్భంగా వేలాది మంది భక్తులు కోనేరులో స్నానం చేశారు. ఈ శనివారం అష్టమి తిథి కావడంతో ఈరోజు ఉదయం నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. కొనేరులో అశుభ్రతతో ఉన్న నీటి వల్ల దుర్వాసన కారణంగా భక్తులలో ఆత్మీయ అనుభవం దిగజారింది. వివిధ ప్రాంతాల నుండి భక్తి శ్రద్ధలతో వచ్చిన భక్తులు, ఈ పవిత్ర పుష్కరిణి నీటిలో స్నానం చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయనే నమ్మకం ఉందని, కానీ ఈ కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇకనైనా ఆలయ అధికారులు ఇటువంటి ప్రత్యేక దినాల్లో ముందుగానే తగిన శుభ్రత చర్యలు తీసుకోవాలి, అష్టముఖీ పుష్కరిణి శుభ్రత, పవిత్రత కాపాడాలన్నదే వారి ఆకాంక్ష అని తెలియచేస్తూ భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే తగిన చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment