భక్తుల కోరికలు తీరుస్తున్నా స్వయంభు నందీశ్వరుడు : త్వరలోనే ప్రఖ్యాతి చెందుతుందని భక్తుల విశ్వాసం.

|| దృశ్యం న్యూస్ ||

భక్తుల కోరికలు తీర్చే ప్రకృతిసిద్ధమైన స్వయంభు  నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాడు. గత శివరాత్రి రోజున ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామం అశోక సాగర్ సమీపంలోని ఈతవనంలో ఓ గీత కార్మికుడు చెట్ల కాండాల మధ్య ఒక శివలింగం మరియు నంది విగ్రహం ఉండటం గమనించాడు, ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు మరియు గ్రామస్తులకు తెలియచేయడం జరిగింది.

అనంతరం ఆ రోజు నుంచి భక్తులు నందీశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించటం, ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడుతుంది. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి నందీశ్వరుడి దర్శనం చేసుకొని భక్తుల సందర్శన సాంప్రదాయంగా కొనసాగుతుండటంతో భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది.

నందీశ్వరుడు భక్తుల కోరికలను నెరవేర్చడంలో ప్రత్యేకంగా నిలుస్తూ ఈ ఆలయనికి వచ్చే భక్తులకు వారి విశ్వాసం మరింతగా వ్యక్తం అవుతు ఈ స్థలంలో ఆలయం రూపుదిద్దుకొని త్వరలోనే ప్రఖ్యాతి పొందుతుందని వారి ఆశ.

భక్తులు ఈ ఆలయంలో వద్ద నందీశ్వరుని పూజలు చేసేందుకు సమయం కేటాయిస్తుండడం ద్వారా, ఆలయానికి సంబంధించిన వృద్ధి, గుర్తింపు చెందుతూ వారి ఆధ్యాత్మిక అనుభవాలను పెంచుకోవడంలో సహాయపడుతుంది. ఈ స్వయంభులింగేశ్వరుడి మహిమను తెలుసుకోవడం ద్వారా భక్తులు మానసిక శాంతిని పొందుతున్నారని, అందుకే వారు తరచుగా ఇక్కడ వస్తున్నారని, ఈ ఆలయం రోజురోజుకీ మరింత ప్రచారం పొంది భక్తుల విశ్వాసం మరియు వారి కోరికలను తీర్చే నందీశ్వరుడు త్వరలోనే ప్రసిద్ధి చెందుతున్నాడని ఆలయ నిర్వాహకులు తెలియజేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment