|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో గత వారం రోజులుగా శ్రీ లక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి, ఈ బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. ఈ వేడుకల సందర్భంగా ఉదయాన్నే వచ్చిన భక్తులకు పక్కనే ఉన్న శివాలయం గర్భగుడి, ఆలయ ప్రాంగణం చెత్తతో నిండి ఉండటాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయాన్ని శుభ్రపరిచి పక్కనే ఉన్న శివాలయాన్ని నిర్లక్ష్యం చేయడం ఏమిటని, సూర్యోదయానికి ముందే శుభ్రపరచాల్సిన ఆలయాన్ని ఉదయం 8 గంటలకు కూడా శుభ్రపరచబడలేదాని ఆలయ నిర్వహకులపై, అధికారులపై తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు శ్రీ లక్ష్మి నరసింహస్వామిని దర్శించడమే కాకుండా పక్కనే ఉన్న శివాలయాన్ని కూడా దర్శించుకుంటారు. ఈ ఆశ్రద్ద వల్ల ఆలయంలోకి అడుగు పెట్టె పరిస్థితి లేకుండా పోయింది అని తెలిపారు.

ఈ ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో లేకపోవడం వల్ల సంబంధిత అధికారులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని భక్తులు ఆరోపిస్తు ఇకనైనా అధికారులు, నిర్వాహకుల నిర్లక్ష్య తీరుపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.








