దేశాయ్ పేట్ సొసైటీ ఉపాధ్యక్షుడు అంబర్ సింగ్ అకాల మృతి: అంత్యక్రియల్లో పోచారం శ్రీనివాసరెడ్డి.

|| దృశ్యం న్యూస్ ||

కామారెడ్డి జిల్లా బాన్సువాడ గ్రామీణ మండలం దేశాయ్ పేట్ సొసైటీ ఉపాధ్యక్షుడు అంబర్ సింగ్ నిన్న గుండెపోటుతో మరణించారు.

ఈ ఘటన తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు రాంపూర్ తండా వెళ్లి అంబర్ సింగ్ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అంబర్ సింగ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం అంబర్ సింగ్ కుటుంబాన్ని పరామర్శించి వారికి సాంత్వన చెప్పారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు అంతిమయాత్రలో పాల్గొన్నారు. అంబర్ సింగ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment