||దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో గల 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్. అంజన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సీజనల్ వ్యాధుల ప్రభావం పెరిగే ఈ కాలంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు,
ఈ సందర్శనలో డాక్టర్. అంజన, ప్రసవాల నిర్వహణ, ఐపి, ఓపి, డెలివరీ రిజిస్టర్ లను పరిశీలించారు. అదేవిధంగా ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందికి సూచనలు చేస్తూ, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని చెప్పారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్. మౌనిక, సి.హెచ్.ఓ జేమ్స్, డిపిఎంఓ శ్రీనివాస్, నర్సింగ్ ఆఫీసర్లు దినేష్, సుజాత, హెల్త్ సూపర్వైజర్ భూలక్ష్మి, సిబ్బంది మురళి, సంతోష్, వాజిద్, లత, పూజ, రాము తదితరులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై గమనించి, వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించటం, ప్రజల ఆరోగ్య సంరక్షణ కై ప్రభుత్వం తీసుకునే చర్యలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని డాక్టర్. అంజన సూచించారు.








