|| దృశ్యం న్యూస్ ||
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ పాలనలో లిక్కర్ స్కాం అవినీతి మరియు అక్రమాలపై ఢిల్లీ ప్రజలు సరైన తీర్పు ఇచ్చారాని, బీజేపీ పార్టీ శ్రేణులు, దౌల్తాబాద్ మండల పార్టీ అధ్యక్షురాలు దేవుడి లావణ్య స్పందించారు.
శనివారం ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం సాధించడంతో, దౌల్తాబాద్ మండల కేంద్రమైన శివాజీ చౌరస్తాలో టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ, “దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం లో ఏ అవినీతి అక్రమాలు చోటు చేసుకోకుండా, ప్రపంచ దేశాలను మించి అభివృద్ధిలో ముందుకు వెళ్ళిపోతున్నామని” కొనియాడారు.
అదేవిధంగా “తెలంగాణలో రానున్న రోజుల్లో బీజేపీ అధికారమే లక్ష్యంగా, పార్టీ శ్రేణులు అందరూ కలిసి పనిచేస్తామని” ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు పోతురాజు కిషన్, కుమ్మరి నర్సింలు, సురేందర్ రెడ్డి, లక్ష్మణ్ యాదవ్, రమేష్, గడ్డమీది స్వామి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.








