|| దృశ్యం న్యూస్ ||
కోటగిరి మండలంలోని బస్వాపూర్ గ్రామంలో దత్త జయంతి సందర్భంగా ఆదివారం దత్తాత్రేయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వ్యవసాయ సలహాదారు,ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
గ్రామంలో చిన్నాపెద్దా తేడా లేకుండా కులాలకు అతీతంగా అందరూ కలసిమెలసి ఉండాలని దత్తత్రేయ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ గ్రామ ప్రజలపై ఉండాలని అన్నారు. మాజి జెడ్పీటీసీ శంకర్ పటేల్, మార్కేట్ కమిటి ఛైర్మన్ హన్మంతు,స్థానిక నాయకులు తదితరులున్నారు.








