కేజీవీపీ బాలికల పాఠశాల చుట్టూ ప్రమాదకర డ్రైనేజీ – నిర్వాహకుల నిర్లక్ష్యం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలోని కస్తూర్బా బాలికల పాఠశాల హాస్టల్ పరిసరాల్లో ఉన్న డ్రైనేజీ తీవ్రంగా ప్రమాదకరంగా మారింది.


విద్యార్థులు తీవ్రమైన అనారోగ్య సమస్యలకు లోనవుతుండగా, సంబంధిత అధికారులు, నిర్వాహకులు స్పందించకపోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

డ్రైనేజీకి సమీపంగా చెత్త వేయడం వల్ల పందులు తిరుగుతున్న దృశ్యాలు రోజు దృశ్యంలోకి వస్తున్నాయి. ఈ విషయంపై పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు అని, తీవ్ర దుర్గంధం, దోమల విపత్తు పెరుగుతూ ఉండగా, తక్షణమే డ్రైనేజీ పనులు పూర్తిచేయాలని విద్యార్థులు మీడియా ద్వారా విన్నవించారు. బాలికల ఆరోగ్య భద్రతకు దృష్టి సారించి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment