మెదక్: సైబర్ జాగృత దివస్ సందర్భంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ టౌన్‌లోని ఇందిరా గాంధీ స్టేడియంలో గురువారం “సైబర్ జాగృత దివస్” సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు సైబర్ డీఎస్పీ సుభాష్ చంద్ర బోస్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

ఎస్ఐ అమర్ మాట్లాడుతూ — రోజురోజుకీ సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయని హెచ్చరించారు. ప్రజలు ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఆన్‌లైన్ బ్యాంకింగ్ మరియు ట్రేడింగ్ సేవలను ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
సైబర్ వారియర్ సిబ్బంది సయ్యద్, సతీష్, సాయిబాబా పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రధానంగా మూడు రకాల సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment