|| దృశ్యం న్యూస్ ||
ఈరోజు సాయంత్రం బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి ఆధ్వర్యంలో బిజెపి బృందం జిల్లా కలెక్టర్‌ను కలిసింది. ఈ సమావేశంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, పసుపు బోర్డు జాతీయ చైర్మన్ పల్లె గంగారెడ్డి పాల్గొన్నారు.

వర్షాల ప్రభావంతో కోసిన ధాన్యం తడిసి రైతులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారని వారు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభమవడం, వడ్ల కుప్పలను లేపకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
బిజెపి నేతలు తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించి కనీస మద్దతు ధర (MSP) వద్ద తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి సీజన్లో రైతులకు టార్పాలిన్లు ఉచితంగా అందించాలి అని విజ్ఞప్తి చేశారు.








