|| దృశ్యం న్యూస్ ||
కేంద్ర బడ్జెట్ 2025 లో దేశ విద్యారంగానికి మోడీ ప్రభుత్వం మొండిచేయి చూపిందని నిజామాబాద్ పార్లమెంట్ తెలుగు యువత బోధన్ ఇంచార్జ్ ఏతొండ రాజేందర్ అన్నారు.
బడ్జెట్ లో విద్యకు కేటాయించిన నిధులు మామూలుగా పెరిగినట్లు కనిపిస్తున్నా, అవి ఆవశ్యకతను తీర్చటానికి సరిపోవడంలేదు. 2024-25 బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయించిన నిధులు 12467.39 కోట్లు నుంచి కేవలం 12500 కోట్లకు మాత్రమే పెరిగాయి, అంటే 0.2% మాత్రమే పెరిగాయని…
పాఠశాల విద్య కోసం కేటాయించిన నిధులు 73008 కోట్ల నుండి 78572 కోట్లకు పెరిగాయి, కానీ కేవలం 500 కోట్లు మాత్రమే పెరిగాయి. విద్యారంగం పరిస్థితి ఇలా కొనసాగితే పేద విద్యార్థుల కోసం మరింతగా అడ్డంకులు సృష్టించబడతాయని వారు అభిప్రాయపడ్డారు. ఉన్నత విద్య కోసం కేటాయించిన నిధులు రూ. 47619.77 కోట్ల నుండి రూ. 50077.95 కోట్లకు పెరిగాయి, అయితే ఇది కేవలం 5% వృద్ధిని సూచిస్తుంది అని..
మొత్తంగా, ఈ బడ్జెట్ లో విద్యారంగం కోసం ప్రాధాన్యత తగ్గించి, కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ తరఫున బీజేపీ చర్యలు తీసుకుంటున్నాయని ఏతొండ రాజేందర్ తెలిపారు.








