మెదక్ పోలీస్ కార్యాలయంలో క్రికెట్ మైదానం శంకుస్థాపన – ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో క్రికెట్ మైదానం ఏర్పాటుకు శంకుస్థాపన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ అధికారి డి.వి. శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ సిబ్బంది శారీరక దృఢత్వం మరియు మానసిక ఉల్లాసం 0కోసం క్రీడలు కీలకమని చెప్పారు. విధుల్లో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించుకోవడంలో, క్రమశిక్షణ, జట్టు భావన, ధైర్యం పెంపొందించుకోవడంలో క్రీడల ప్రాధాన్యం ఎంతో ఉన్నదని పేర్కొన్నారు.

పోలీస్ యువ సిబ్బంది ప్రతిభను వెలికితీయడానికి, క్రీడా పోటీలు నిర్వహించడానికి ఈ క్రికెట్ మైదానం అనువుగా ఉపయోగపడుతుందని తెలిపారు. భవిష్యత్తులో ఇతర ఆటల వేదికలు కూడా ఏర్పాటు చేయాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎస్. మహేందర్, డిఎస్పి ప్రసన్నకుమార్, సిఐలు రాజశేఖరరెడ్డి, సందీప్ రెడ్డి, ఆర్‌లు శైలేందర్, రామకృష్ణ, ఆర్ఎస్‌ఐ నరేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment