|| దృశ్యం న్యూస్ ||
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటా వారోత్సవాలను జయప్రదం చేయాలని సిపిఐ మండల కమిటీ పిలుపునిచ్చింది. కోటగిరి మండల కేంద్రంలో జరిగిన ప్రెస్ మీట్‌లో సిపిఐ మండల కార్యదర్శి ఏ. విటల్ గౌడ్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 17న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ సాయుధ పోరాట దినోత్సవం నిర్వహించాలని డిమాండ్ చేశారు.
కోటగిరి బస్టాండ్ ఆవరణలో సిపిఐ జెండా వద్ద జరగనున్న ఈ వేడుకల్లో భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన మహోత్తర పోరాటాలను గుర్తు చేస్తారని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటాల చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ పోరాట చరిత్రను వక్రీకరిస్తోందని, కమ్యూనిస్టులే నిజమైన వారసులని విమర్శించారు.








