|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లాలో గ్రూప్-3 పరీక్ష కేంద్రాల్లో ఆంక్షలు విధించాలని ఇంచార్జి సీపీ సింధు శర్మ తెలిపారు. ఈనెల 17, 18 తేదీల్లో జరగనున్న గ్రూప్-3 పరీక్షలు సరైన విధానంలో నిర్వహించేందుకు జిల్లాలో మొత్తం 66 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఏసీపీ, సీఐ, ఎస్‌హెచ్‌ఓ, ఎస్ఐలను స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా 144 సెక్షన్ అమలు చేస్తామని, 100 మీటర్లలోపు ఉన్న జిరాక్స్ షాపులను మూసివేయాలని సూచించారు. అదేవిధంగా 22 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలకు ఒక్కో పోలీస్ అధికారిని కేటాయించడం జరిగింది.
లా అండ్ ఆర్డర్ సమస్య లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఈ చర్యలు సమర్థంగా పరీక్షలు నిర్వహించేందుకు ముఖ్యమైనవి అని, గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా, నిబంధనలు పాటించి జరిగేలా ఉండాలని పోలీసులు తగు చర్యలు పాటిస్తున్నారు.








