|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో మహిళా సంఘాల డబ్బులు అధికారులు అవినీతిమయంగా లబ్ది పొందిన విషయానికి సంబంధించిన ఆరోపణలు స్థానికుల్లో విపరీతంగా చర్చ కొనసాగింది,
ప్రభుత్వ ఉద్యోగి అయిన వివో గణేష్ మరియు సీసీ శాంత పై నమోదైన అవినీతి ఆరోపణలు మహిళా సంఘాల సభ్యుల మధ్య ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి, వీరిరువురు కలసి మహిళ సంఘనికి చెందిన డబ్బు సంఘ సభ్యులకే తెలియకుండా దాదాపు రూ. 3.5 లక్షల రూపాయలు వాడుకొని సదరు మహిళా సంఘాల మహిళల పైనే నెల నెలకు కట్టే వాయిదా డబ్బులు మహిళలపైనే వేస్తూ గుట్టు చప్పుడు కాకుండా వ్యవహరిస్తున్నారాని,
ఏపీఎం సునీత రహస్యంగా చరవాణిలో సమావేశాలు నిర్వహించి, అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని, స్థానికులు ఆరోపిస్తున్నారు. సీసీ శాంతపై గతంలోనూ అనేక అవినీతి ఆరోపణలు ఎదురయ్యాయి, అయిన ఆమె తీరు మార్చుకోవడం లేదు, ఐకెపి వ్యవస్థలో ఆమెకు ఉన్న అండ దండలే దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నప్పటికీ, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

ఆర్థిక లబ్ధి కోసం మహిళా సంఘాల డబ్బులను అధికారులు కాజేయడం, ఇలాంటి వ్యవహారాలను అత్యంత కఠినంగా తిరస్కరిస్తూ తగిన గుణపాఠం చెప్పాలని, ఈ అవినీతిని అరికట్టడానికి ప్రభుత్వ ఉన్నత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి అని స్థానికులు మనవి చేస్తున్నారు.
మహిళల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రుణాలను, ప్రభుత్వ ఉద్యోగులు దుర్వినియోగం చేయడం అనేది అత్యంత ఆందోళనకరం, ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారో లేదో చూడాలి.








