|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని అమ్మ అనాథాశ్రమంలో ఉంటూ, కష్టపడి చదివి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన లక్ష్మణ్ అనే యువకుడిని అభయహస్తం ఫౌండేషన్ ఘనంగా సన్మానించింది. బుధవారం జరిగిన కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు బర్ల మధుకర్, సతీమణితో కలిసి లక్ష్మణ్‌కు శాలువా కప్పి, పూలమాలలతో అభినందించారు.
ఈ సందర్భంగా మధుకర్ మాట్లాడుతూ ఆశ్రమంలో పెరిగినా తన పట్టుదలతో విజయాన్ని సాధించిన లక్ష్మణ్ యువతకు ఎంతో ఆదర్శం అని, చదువు అనే ఆయుధంతో భవిష్యత్తు నిర్మించుకోవచ్చు అని, మన పరిస్థితులు ఎప్పటికీ అడ్డుగా ఉండవని, లక్ష్యాన్ని ఎంచుకొని కష్టపడితే తప్పకుండా విజయం సాధించొచ్చు అన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.








