ప్రమాదానికి గురైన వ్యక్తిని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, ఇందల్వాయి గ్రామానికి చెందిన సంఘం బుజ్జన్న (47) గత కొన్ని రోజుల క్రితం ఇందల్వాయి నుండి డిచ్ పల్లి వైపు వెళ్తున్నప్పుడు ప్రమాదానికి గురి కావడంతో గాయాలతో కఠినమైన పరిస్థితిలో హాస్పిటల్‌లో చికిత్స పొందిన అనంతరం ఇంటికి తిరిగి వచ్చాడు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, గ్రామ కమిటీ చైర్మన్ జితేందర్, మాజీ వైస్ ఎంపిపి ఎడపల్లి ముత్తన్న, మాజీ ఎంపీటీసీ మారాంపల్లి సుధాకర్ మరియు బిపేటి సాయిలు, బుజ్జన్నను పరామర్శించారు.

అతని ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకుని బాధితుడు చేసిన చికిత్సకు సంబంధించిన ఖర్చులు మరియు బిల్లులను పరిశీలించి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి తక్షణమే మంజూరి చేయించే ప్రయత్నం చేస్తామని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment