కామ్రేడ్ చింతం గంగయ్య మరణం: పేద ప్రజలకు తీరని లోటు.

|| దృశ్యం న్యూస్ ||

అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (AIPKMS) రాష్ట్ర ఉపాధ్యక్షులు కే.గంగాధర్, కామ్రేడ్ చింతం గంగయ్య మరణాన్ని పేద ప్రజలకు తీరని లోటుగా అభివర్ణించారు. మంగళవారం సాలూర మండలంలోని ఖాజాపూర్ గ్రామంలో అంతిమ యాత్రకు హాజరై కామ్రేడ్ గంగయ్య వ్యవసాయ కార్మికుల, రైతుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేశారని తెలిపారు.

కామ్రేడ్ గంగయ్య, రైతుల మరియు పేద ప్రజల సంక్షేమం కోసం చేసిన కృషి మరువలేనిది అని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, ఆయన ఆశయాలను కొనసాగించాలని కే.గంగాధర్ పిలుపునిచ్చారు. కామ్రేడ్ గంగయ్య యొక్క మరణం ఉద్యమానికి తీరని లోటుగా మారనుందని, ఆయన కృషి అందరికీ స్ఫూర్తినిస్తుంది తెలిపారు

ఈ అంతిమ యాత్రలో సి.పి.ఐ (ఎం-ఎల్) మాస్ లైన్ బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి.మల్లేష్, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం(A I P K S) జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మల గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షులు పుట్టి నాగన్న, జిల్లా కమిటీ నాయకులు పడాల శంకర్, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పార్వతి రాజేశ్వర్, జిల్లా ఉపాధ్యక్షులు ఒడ్డేన్న, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.కె. నసీర్, ప్రగతిశీల మహిళా సంఘం ( P O W ) బోధన్ పట్టణ అధ్యక్షురాలు బి. నాగమణి, జిల్లా నాయకులు బీపాషా బేగం, మండల నాయకురాలు ఎం.శాంతమ్మ, T U C I నాయకులు ఇర్షద్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment