విద్యార్థులకు విద్యా ప్రమాణాలను పెంపొందించాలి : కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

|| దృశ్యం న్యూస్ ||

శుక్రవారం రోజు నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులతో సమావేశం జరిగింది.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచుకోవాలని, రాబోయే పదవ తరగతి పరీక్షల కోసం విద్యార్థులను పూర్తిగా సమాయత్తం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలకు తెలియజేసారు.

 

 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం, వారు క్రమశిక్షణగా చదవడం, పాఠశాలల్లో చురుకుగా ఉండేలా చూడాలి” అని పేర్కొన్నారు. ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థులకు అభ్యస పరీక్షలు వంటివి చేపట్టి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

పదవ తరగతి పరీక్షల కోసం ప్రతిరోజూ ప్రత్యేక తరగతులను పకడ్బందీగా నిర్వహించాలని, వాటికి సంబంధించి విద్యార్థులకు కేటాయించే అల్పాహారం కూడా పక్కాగా అందించాలనీ కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి పి. అశోక్, ఏ.సి. విజయభాస్కర్, మరియు 300 మంది ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment