మెదక్ జిల్లాలో కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటన – రైతులకు కీలక సూచనలు.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ మండలంలోని రాజ్‌పల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విస్తృత పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రం, 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను పరిశీలించి, రికార్డులను పరిశీలించారు. ధాన్యం సేకరణ విధానం, తేమ స్థాయిలు, విద్యుత్ సరఫరా పరిస్థితులను వివరంగా అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచిస్తూ, మెదక్ జిల్లాలో మొత్తం 498 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయని, కేంద్రాల వద్ద ధాన్యం ఆరబెట్టే రైతులకు టోకెన్లు, మిల్లులకు ట్యాగింగ్ సదుపాయం అందిస్తున్నామని తెలిపారు.
ధాన్యం సరఫరా కోసం వాహనాలు సిద్ధంగా ఉన్నాయని, బిల్లులు వేగంగా చెల్లించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. రైతాంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ నిరంతరంగా అందించాలనీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment