|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బాల్యవివాహాలు జరగకుండా, డ్రగ్స్ నిర్మూలన మరియు పోక్సో చట్టంపై అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం మెదక్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ — ప్రతి గ్రామంలో బాల్యవివాహాలను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలు పనిచేయాలని సూచిస్తూ, బాల కార్మికత్వం నిర్మూలనతోపాటు బాలల హక్కుల సంరక్షణకు అధికారులు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.

అలాగే యువతలో డ్రగ్స్ వాడకం నివారించేందుకు డ్రగ్ అవగాహన కార్యక్రమాలు నిరంతరంగా నిర్వహించాలని, పాఠశాలలు, కళాశాలల స్థాయిలో పోక్సో చట్టం అవగాహన సెమినార్లు చేయాలని, యువత సన్మార్గం వైపు నడిచేలా ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.
ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఓ శ్రీనివాసరావు, డిఆర్ఓ భుజంగరావు, ఆర్డీవో రమాదేవి, ఆర్డీవో మహమ్మద్ అహ్మద్, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి హేమా భార్గవి తదితరులు పాల్గొన్నారు.








