|| దృశ్యం న్యూస్ ||
స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి, పోషకాహార స్టాళ్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “రక్తహీనత, పోషక లోపం లేని మెదక్ జిల్లాగా తీర్చిదిద్దడం మన లక్ష్యం” అన్నారు.
అదేవిధంగా బాల్యవివాహాలను కఠినంగా అరికట్టాలని హెచ్చరిస్తూ, పెళ్లికొడుకు కుటుంబ సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలకు జైలు శిక్ష తప్పదని తెలిపారు. గర్భిణీలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే గుడ్లు, పాలు, ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని,
పోషణ మాసం ద్వారా మహిళలు, బాలింతలు, గర్భిణీలలో ఆరోగ్య అవగాహన పెంపొందించడమే లక్ష్యమని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో ఉత్తమ సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు.








