|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శివంపేట్ మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) మరియు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని పరిశీలించారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరిగేలా వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని, రోజువారీ మెనూను ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు.

ఆసుపత్రిలో ఓపీ రిజిస్టర్‌ను తనిఖీ చేసి, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రసవాల గణాంకాలను అడిగి తెలుసుకున్నారు. గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఆసుపత్రిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.

అనంతరం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులకు అందుతున్న మెనూను పరిశీలించి, నాణ్యతను ధృవీకరించారు. భోజన నాణ్యత, ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల సామర్థ్యాలపై సమీక్ష నిర్వహించి, గుణాత్మక విద్య అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.









