మెదక్ జిల్లాలో నిరంతరాయ విద్యుత్ సరఫరాకు చర్యలు : కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రశంసలు

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లాలో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగేందుకు విద్యుత్ శాఖ తీసుకుంటున్న చర్యలపై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హర్షం వ్యక్తం చేశారు.
గురువారం పాపన్నపేట మండలంలో మిన్పూర్ 220/132 కెవి సబ్‌స్టేషన్‌ను విద్యుత్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించిన కలెక్టర్ రానున్న వేసవిలో విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ వివిధ గ్రామాల్లో విద్యుత్ సరఫరా స్థితిగతులను ప్రత్యక్షంగా పరిశీలించారు. కుర్తివాడ గ్రామంలో గ్రామస్తులను కలిసి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
విద్యుత్ బ్రేకర్లను, యూనిట్ వినియోగాన్ని పరిశీలించి, ఓవర్‌లోడ్ సమస్యలు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.

విద్యుత్ సంబంధిత ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని, వినియోగదారులకు 1912 టోల్‌ఫ్రీ నెంబర్ గురించి విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్‌.ఈ. శంకర్, డీఈ బాషా, ఏ.ఈ శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment