మెదక్ జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా ప్రజలందరికీ, అధికారులు, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు విజయ దశమి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అక్టోబర్ 2న జరుపుకునే దసరా పండుగ సందర్భంగా కలెక్టర్ ప్రత్యేక సందేశాన్ని అందించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విజయదశమి పర్వదినం చెడుపై మంచికి లభించిన విజయానికి ప్రతీక అని గుర్తుచేశారు. ఈ పండుగ ప్రతి ఇంటిలో సంతోషం, ఐకమత్యం, శాంతి, సౌభాగ్యం నింపాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ అమ్మవారి చల్లని దీవెనలతో ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, పాడిపంటలు పుష్కలంగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని కలెక్టర్ ఆకాంక్షించారు. దసరా పండుగతో ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలని, సామాజిక సౌహార్దం మరింత బలపడాలని కోరుకున్నారు.

ప్రజలందరు పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ విజయదశమి పండుగ జిల్లా అభివృద్ధికి, ప్రజల శ్రేయస్సుకు మార్గం చూపాలని ఆకాంక్షించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment