మెదక్ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ ఆసుపత్రి యొక్క వివిధ విభాగాలను సందర్శించి, రోగులకు అందిస్తున్న వైద్య సేవల నాణ్యతను పరిశీలించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఇన్‌పేషెంట్ వార్డులు, ల్యాబ్, టీకాలు ఇచ్చే గది, ఔషధాలు నిల్వ ఉంచిన డ్రగ్ స్టోర్ తదితర విభాగాలను, సిబ్బంది యొక్క హాజరు పట్టికను కూడా తనిఖీ చేశారు.
అదేవిధంగా కలెక్టర్ రోగులను పలుకరించి, వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగేందుకు వైద్య సిబ్బంది మరింత అంకిత భావంతో పనిచేయాలని రాహుల్ రాజ్ కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment