|| దృశ్యం న్యూస్ ||
మెదక్‌లో బీసీ ఉద్యమం శక్తివంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న బీసీ ఉద్యమంలో భాగంగా, బీసీ సంఘాల నేతలు రేపు శనివారం బంద్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా బంద్‌కి అన్ని వర్గాలు, అన్ని సమాజాలు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు.
మెదక్ పట్టణంలోని టీఎన్ జీఓల భవనంలో నిర్వహించిన సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చ జరిగింది. బీసీ సంఘాల నేతలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని సపోర్ట్ చేయాలని స్థానికంగా కూడా నిరంతరం మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని, చట్టపరమైన రక్షణలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇలాగే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల లేని ఇబ్బందులు బీసీలకు ఎందుకు అనేది ప్రశ్నించగా, సామాజికంగా వెనుకబడ్డ బీసీ వర్గాల ప్రయోజనాల కోసం అన్ని కులాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు.








