|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఈనెల 10న సీఎం కప్ క్రీడలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా కబడ్డీ, వాలీబాల్, కోకో వంటి క్రీడలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తూ మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయికి పంపిస్తామని తెలిపారు.
బుధవారం క్రీడల పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు అందరికీ ప్రోత్సాహక బహుమతులు అందించగా కార్యక్రమంలో ఎంపీడీవో బాలకృష్ణ, విద్యాశాఖ అధికారి, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం విద్యార్థులలో క్రీడా ప్రతిభను పెంచడంలో, వారిని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.








