|| దృశ్యం న్యూస్ ||
బాలల దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ పట్టణంలోని హోవార్డు ఉన్నత పాఠశాలలో గురువారం ఘనంగా సంబరాలు నిర్వహించబడ్డాయి.
రోటరీ క్లబ్ వద్ద ఉన్న ఈ పాఠశాలలో చదువుతున్న చిన్నారులకు ఉపాధ్యాయులు పూల వర్షంతో ఘనంగా స్వాగతం పలుకుతూ, వారు ఆనందంగా ఉండేలా పలు ఆసక్తికరమైన ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ, “బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాలలో చదువుకునే చిన్నారులకు శుభాకాంక్షలు తెలియచేస్తూ, మా పాఠశాల యొక్క ప్రధాన లక్ష్యం విద్యార్థులకు మంచి విద్యతో పాటు, మంచి ఆచార ధర్మాలతో ముందడుగు వేయించడం అని, ఈ రోజు వారికి ఆనందం కలిగించే కార్యక్రమాలను ఎన్నో నిర్వహించి బహుమతులు అందచేసామని, వారి సంతోషమే మాకు ముఖ్యమని తెలిపారు” విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించడం కొరకు పాఠశాల నిర్వాహకులు మరియు సిబ్బంది ఎల్లవేళలా ఎంతో కృషి చేస్తూనే ఉంటారని తెలిపారు.

అదేవిధంగా “విద్యార్థులు భవిష్యత్తులో ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని, సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాం అని, ఈ రోజు చిన్నారుల దినోత్సవం సందర్భంగా ప్రతి చిన్నారి ఆయురారోగ్యాలతో అందంగా జీవించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం” అని శ్రీనివాస్ రావు తెలిపారు.
ఈ వేడుకలో చిన్నారులతో తో పాటు ఉపాధ్యాయులు, మరియు పాఠశాల యాజమాన్యం కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు.








