|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల బంద్ విజయవంతం – SFI, AISF, PDSU, AIPSU
ఈ రోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభుత్వ పాఠశాల బంద్ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా SFI, PDSU జిల్లా ప్రధాన కార్యదర్శులు రాచకొండ విగ్నేష్, డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 11 నెలలు అధికారంలోకి వచ్చిన నుండి కల్తీ ఆహారం, ఫుడ్ పాయిజన్ల సంఘటనలు, పాము కాట్లు, మధ్యాహ్న భోజనం పథకంలో కారం మెతుకులు, నాణ్యత లేని భోజనాలతో విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ విద్యార్థుల ప్రాణాలను నష్టం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నియమాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించి, ఫుడ్ పాయిజన్ ఘటనలపై సమీక్ష నిర్వహించాలని, దీర్ఘకాలిక కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులు, ముఖ్యంగా పేద, మధ్యతరగతి విద్యార్థుల పట్ల తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్య ప్రవర్తనను తక్షణం నిలిపివేయాలి అని వారు వ్యాఖ్యానించారు. మధ్యాహ్న భోజనం పథకం కోసం నిధులను పెంచి, నాణ్యమైన భోజనాలను అన్ని ప్రభుత్వ పాఠశాలలలో, గురుకుల కేజీబీవీలలో, సంక్షేమ హాస్టల్స్‌లో అందించాలని కోరారు.
ఈ కార్యక్రమం నిజామాబాద్ జిల్లాలో విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో AISF జిల్లా కార్యదర్శి రఘురామ్, PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, AIPSU జిల్లా కార్యదర్శి బోడ అనిల్, SFI జిల్లా అధ్యక్షురాలు దీపిక, నవీన్, కుశాల్, సాయి, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.








