గొంగ్లూర్ గ్రామంలో చత్రపతి శివాజీ మహరాజ్ జయంతి ఉత్సవాలు.

|| దృశ్యం న్యూస్ ||

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని గొంగ్లూర్ గ్రామంలో చత్రపతి శివాజీ మహరాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. 395వ జయంతి సందర్భంగా శివాజీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.

చత్రపతి శివాజీ తన చిన్నతనంలోనే ధైర్యం, పౌరుషంతో భారతదేశం కోసం తన జీవితాన్ని అంకితం చేశాడని, జిజియాబాయ్ మాటలతో ప్రేరణ పొందిన శివాజీ హిందూ ధర్మం కాపాడేందుకు అనేక కష్టాలను భరించి, మొగల్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొని ఎన్నో విజయాలు సాధించారు.

ఈ సందర్భంగా, గ్రామంలోని యువకులు, స్థానికులు బైక్ ర్యాలీ నిర్వహించి, పూలమాలలు వేసి ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతిని ఘనంగా జరిపారు.
ఈ సందర్భంగా BJP సీనియర్ నాయకులు జయరాం రెడ్డి, విద్యా విభాగం అధ్యక్షుడు కుమ్మరి అశోక్, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, అంకం దశరథ, నాయకవాడి నగేష్ గౌడ్, మల్లికార్జున్, రామచంద్ర రెడ్డి, పుట్టి బాలరాజ్ , ఆకుల హరిచంద్ర ప్రసాద్ సహా పలువురు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment