బాన్సువాడ పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు.

|| దృశ్యం న్యూస్ ||

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలో ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మెన్ కాసుల బాల్ రాజ్, మాజీ మున్సిపల్ ఛైర్మెన్ గంగాధర్, కామారెడ్డి జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఖలేఖ్, రవీందర్, గంగుల గంగారాం, ఎజాస్, జిల్లా యువజన అధ్యక్షులు మధుసుధన్ రెడ్డి, హకీమ్ మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు, ప్రజలు శివాజీ మహారాజ్ దేశ భక్తి, ధైర్యం మరియు యుద్ధ నైపుణ్యం గురించి వాస్తవాలు వివరించారు. శివాజీ మహారాజ్ జయంతి ప్రతి సంవత్సరమూ ఈ ప్రాంతంలో ఆనందంగా, ఎంతో ఉత్సాహంగా నిర్వహించబడుతుంది తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment