నిజామాబాద్‌లో స్కూల్, ప్రైవేట్ బస్సులపై తనిఖీలు – విద్యార్థుల భద్రతే లక్ష్యం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్: విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్కూల్ బస్సులు మరియు ప్రైవేట్ బస్సులపై విస్తృత తనిఖీలు నిర్వహించారు. కమిషనర్ పి. సాయి చైతన్య, ఆదేశాల మేరకు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో పోలీసులు మరియు మోటార్ వాహనాల శాఖ సంయుక్తంగా ఈ తనిఖీలు చేపట్టారు.

తనిఖీల సందర్భంగా అధికారులు బస్సుల వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, ఇన్స్యూరెన్స్ వివరాలు సవివరంగా పరిశీలించారు. నియమాలు ఉల్లంఘించిన వాహనాలపై కేసులు నమోదు చేసి, డ్రైవర్లకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
పోలీస్ అధికారులు మాట్లాడుతూ — “విద్యార్థుల ప్రాణ భద్రత మా ప్రాధాన్యం. రవాణా నియమాలు పాటించని వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి తనిఖీలు నిరంతరంగా కొనసాగుతాయని పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment