|| దృశ్యం న్యూస్ ||
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై సంబంధిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీడీపీ నాయకుడు బోధన్ ఇంచార్జ్ ఏతొండ రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజేందర్ మాట్లాడుతూ, “చంద్రబాబు జోలికెళ్లితే ఖబడ్దార్” అంటూ కేసీఆర్ పై అనేక ఆరోపణలు చేశారు.
“చంద్రబాబు మరో రూపంలో తెలంగాణ రాజకీయాల్లో వస్తున్నారని” చేసిన వ్యాఖ్యలను విమర్శించారు. తెలంగాణ ప్రాంతాన్ని విడగొట్టే పనిలో కేసీఆర్ భాగస్వామి కావడాన్ని తప్పుబట్టారు. “ఇరు రాష్ట్రాల మధ్య వైశమ్యాలను రెచ్చగొట్టి, స్వార్థ బుద్ధితో రాజకీయాలు చేస్తూ, కేసీఆర్ చంద్రబాబును విమర్శించడం అవివేకానికి నిదర్శనం” అని తెలిపారు.
మరోసారి, చంద్రబాబు నాయకత్వం 20-20 విజన్ ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధిని సాధించాడని గుర్తు చేశారు. చంద్రబాబు విజన్ 2047 కలిగి ఉంటే, కేసీఆర్ ఏవిజన్ లేని నాయకుడని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ తెలంగాణ ప్రాంతానికి వాడిన మాటలు, చేసిన వాగ్దానాలు అని ప్రజలకు హాని చేసేవే అని అన్నారు.








