చలో ఢిల్లీ: వికలాంగుల హక్కుల కోసం బోధన్ పట్టణం నుంచి ప్రయాణం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం నుండి ఎన్ పి ఆర్ డి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో “చలో ఢిల్లీ” కార్యక్రమానికి శుక్రవారం రోజున నాయకులు మరియు కార్యకర్తలు బయలుదేరారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రధానంగా వికలాంగుల హక్కులపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఎన్ పి ఆర్ డి నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యేషల గంగాధర్ మాట్లాడుతూ, “కేంద్ర ప్రభుత్వం వికలాంగులకు నెలకి కేవలం 300 రూపాయలు మాత్రమే ఇస్తుందని, దీనిని 5000 రూపాయలకు పెంచాలని, 2016 చట్టం ప్రకారం ప్రతి వికలాంగుడికి అంథోదయ రేషన్ కార్డులు ఇవ్వాలని, అలాగే 200 రోజులు ఉపాధి హామీ పథకంలో పని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని,
ఫిబ్రవరి 10వ తేదీన ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు మహా ధర్నా నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా వికలాంగులు ఈ ధర్నాలో పాల్గొనడానికి పెద్దయెత్తున్న పాల్గొనబోతున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ ప్రధాన కార్యదర్శి, జిల్లా ఉపాధ్యక్షులు గంపల శంకర్, కోశాధికారి రామ్ పటేల్, నాగనాథ్ పటేల్, ఎల్లయ్య, చింటూ సాయినాథ్, జగన్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment