కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయుల ధర్నాకు పిలుపు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఈ నెల 14 సోమవారం రోజున నిర్వహించబోయే నిరసనకు షెడ్యూల్డ్‌ తెగ ఉపాధ్యాయులందరిని డీటీఫ్‌ ప్రతినిధి బాలయ్య, ఎస్సీ, ఎస్టీ యూస్‌ ప్రతినిధి సుధాం, ఆర్‌యూపీపీ ప్రతినిధి జమీల్‌ పిలుపునిచ్చారు.
ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి డీఈవోను కలిసిన సమయంలో అనుచితంగా ప్రవర్తించడం ఆందోళన కలిగించిందన్నారు. ఈ ఘటనకు నిరసనగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వారు వెల్లడించారు.
ఉపాధ్యాయుల హక్కుల సాధనకు, అన్యాయానికి వ్యతిరేకంగా ఈ నిరసన ముఖ్యమైనది అని ప్రతి ఉపాధ్యాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ గళాన్ని వినిపించాల్సిన అవసరం ఉందని తెలుపుతూ
సమస్యలను పరిష్కరించడంలో నిరంతర ప్రయత్నాలు చేపట్టడం అతి ముఖ్యమని సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment