స్వామి వివేకానంద, భగవాన్ శ్రీ రామకృష్ణ జీవిత చరిత్రపై పుస్తక ప్రదర్శన.

|| దృశ్యం న్యూస్ ||

స్వామి వివేకానంద, భగవాన్ శ్రీ రామకృష్ణ ధర్మ వ్యవస్థను ను స్థాపించి 125 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో రామకృష్ణ సేవా సమితి కోటగిరి శాఖ వారు బోధన్ పట్టణంలోని ఇందూర్ హైస్కూల్‌లో శనివారం రోజున వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. హైదరాబాద్ రామకృష్ణ మఠం ఆదేశాల మేరకు విద్యార్థులకు “భారత జాతికీ నా హితవు” అనే అంశంపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ పోటీలో దాదాపు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

 

అదే విధంగా భగవాన్ శ్రీ రామకృష్ణ వారి జీవితం మరియు స్వామి వివేకానంద జీవితంపై ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భగవాన్ శ్రీ రామకృష్ణ, మరియు స్వామి వివేకానంద వారి జీవిత చరిత్రలతో కూడిన మఠ పుస్తక ప్రచురణలు ప్రదర్శించబడ్డాయి.
ఈ కార్యక్రమంలో 1800 మంది విద్యార్థులు పాల్గొని ఫొటో ఎగ్జిబిషన్ ను వీక్షించి పుస్తకాలు కొనుగోలు చేశారు.

ఈ కార్యక్రమంలో రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్ కోఆర్డినేటర్ గోగినేని శివ శ్రీనివాస్, సేవా సమితి అధ్యక్షుడు బర్ల రమేష్, కార్యదర్శి హన్మంత్ రావు, వాన ప్రస్థ ఆశ్రమం స్వామి యోగానంద, పాఠశాల సూపరిండెంట్ కొడాలి కిశోర్, ప్రధానోపాధ్యాయులు కె.ఎస్. రామారావు, అడ్మినిస్ట్రేటివ్ ఇంచార్జ్ కె. స్వాతి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment