|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం, రూరల్ ప్రాంతం, అలాగే రెంజల్, ఎడపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో ఈరోజు సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ఏడీఈ) ప్రభాకర్ తెలిపారు.
ఈ అంతరాయం నెలవారీ నిర్వహణ మరమ్మత్తుల కారణంగా ఏర్పడుతుందని తెలిపారు. బోధన్ సబ్ స్టేషన్ 33/11 కెవితో పాటు రెంజల్ సబ్ స్టేషన్, ఎడపల్లి మండలంలోని మంగళ్‌పహాడ్ సబ్ స్టేషన్, బోధన్ మండలంలోని పెగడపల్లి, ఊట్పల్లి సబ్ స్టేషన్ల పరిధిలోని గ్రామాలందరికీ ఇది వర్తించనుంది.
విద్యుత్ వినియోగదారులు, పరిశ్రమల యాజమాన్యాలు ఈ రెండు గంటల అంతరాయాన్ని గమనించి ముందస్తుగా తమ అవసరాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. సాయంత్రం 5 గంటల తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని వెల్లడించారు.








