బోధన్ – జిల్లా స్థాయి ఇన్స్పైర్ & సైన్స్ ఫెయిర్ ప్రదర్శన.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇన్స్పైర్ (2024–25) మరియు సైన్స్ ఎగ్జిబిషన్ (2025–26) ప్రదర్శనలు నవంబర్ 23 నుండి 25 వరకు బోధన్‌లోని విజయ మేరీ పాఠశాలలో నిర్వహించబడనున్నాయి.
ఈ ప్రదర్శనలు ఎస్సీఈఆర్టీ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పి. అశోక్ తెలిపారు.

జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ విద్యార్థులను సబ్ థీమ్స్‌కి అనుగుణంగా ప్రదర్శనలో పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు. 6వ తరగతి నుండి 8వ తరగతి వరకు జూనియర్ విభాగం, 9వ నుండి 12వ తరగతి వరకు సీనియర్ విభాగంగా విభజించి ప్రదర్శనలు నిర్వహించబడతాయి.
ఇన్స్పైర్ అవార్డు 2024–25 కోసం జిల్లాలో 119 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వారి ఖాతాలలో ₹10,000 చొప్పున జమ చేయబడింది. ఈ విద్యార్థులు కూడా సైన్స్ ఫెయిర్‌లో పాల్గొననున్నారు. విద్యార్థులు సామాజిక ప్రయోజనకరమైన సైన్స్ మోడల్స్ రూపొందించి ప్రదర్శనలో చురుకుగా పాల్గొనాలని అధికారులు సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment