|| దృశ్యం న్యూస్ ||
బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్ మండలంలోని చీకడపల్లి, అంబం గ్రామాల్లో బీజేపీ కార్యకర్తలతో సమావేశమైన బీజేపీ నాయకుడు ఎన్నారై కోనేరు శశాంక్ ఆర్థిక సహాయం అందించారు. ఇటీవల చీకడపల్లి గ్రామంలో జరిగిన కారు ప్రమాదంలో బీజేపీ కార్యకర్తలుగా గుర్తింపు పొందిన ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన కోనేరు శశాంక్, వారికి 25 కేజీల బియ్యం మరియు ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.

అలాగే, అంబం(ఆర్) గ్రామంలో నిన్న అగ్ని ప్రమాదంలో ఆర్థిక నష్టపోయిన మహిళల ఇళ్లకు సహాయం అందించారు. కోనేరు శశాంక్, రెండు కుటుంబాలకు 25 కేజీ బియ్యం మరియు 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.
ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గం కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, తదితర నాయకులు పాల్గొన్నారు.








