శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి.

|| దృశ్యం న్యూస్ ||

ధర్పల్లి మండలం గోవింద్ పల్లి గ్రామంలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అద్భుతంగా కొనసాగుతున్నాయి.
ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పాల్గొని స్వామి వారి కళ్యాణాన్ని తిలకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ కమిటీ మరియు గ్రామ కమిటీ సభ్యులు అతిధిని ఘనంగా సన్మానించారు.
దినేష్ కులచారి మాట్లాడుతూ, ఈ ప్రత్యేక పండగ కార్యక్రమానికి ఆహ్వానించిన ఆలయ కమిటీకి కృతజ్ఞతలు తెలుపుతూ, గ్రామంలో 12 సంవత్సరాల క్రితం ప్రారంభించిన స్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం మూడు రోజులపాటు వార్షికోత్సవాలను నిర్వహించడం గొప్ప విషయం అని అభినందనలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గొల్ల రాజగణేష్, కర్రోల్ల శ్రీనివాస్, దొడ్డెనుక రాజేందర్, సంబేటి పెద్ద నర్సయ్య, ఒడ్డేటి జలంధర్, చెరుకు నడిపి గంగారాం మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment