మెదక్‌లో ROB నిర్మాణానికి భూమి పూజ – ఎంపీ రఘునందన్ రావు కృషి ఫలితం.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సహకారంతో, దక్షిణ మధ్య రైల్వే జీఎం సంతోష్ కుమార్‌తో కలిసి చేగుంట-మెదక్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణానికి భూమి పూజ చేశారు.
దశాబ్దకాలంగా ప్రజల చిరకాల కోరికగా ఉన్న ఈ బ్రిడ్జి 100% కేంద్ర నిధులతో నిర్మించబడుతుంది.

ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రైల్వే డబ్లింగ్ ప్రాజెక్ట్‌లో భాగంగా రూ.3,800 కోట్లతో ముత్కేడు-కర్నూలు రైల్వే పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. చేగుంట స్టేషన్‌లో కొత్త ప్లాట్‌ఫాం, రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు కాబోతుందని తెలిపారు. ROB పనులు 18 నెలల్లో పూర్తవుతాయని, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా డైవర్షన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Join WhatsApp

Join Now

Leave a Comment