|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజి రెడ్డి గెలుపొందిన సందర్భంగా, గురువారం ఉదయం ఎడపల్లి మండల బిజెవైఎం ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి సంబరాలు నిర్వహించారు.

అదేవిధంగా, ఎమ్యెల్సీ ఎన్నికల్లో పాల్గొని భాజపాకు సహకారం అందించిన పట్టభద్రులకు, ఉపాధ్యాయులకు భాజపా పార్టీ శ్రేణులు ధన్యవాదాలు తెలియచేసారు.
ఈ వేడుకలో బిజెవైఎం మండల అధ్యక్షులు సాయి, సీనియర్ నాయకులు కట్కామ్ శంకర్, బట్టు రాజు, బూత్ అధ్యక్షులు అరుణ్, కంజరి ప్రదీప్, వేణు, వీరేంధర్, సుధాకర్, అమర్, అనిరుద్, రఘు, సురేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొని విజయోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.








