|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే యం. పద్మ దేవేందర్ రెడ్డి. తెలంగాణ సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ఆడపడుచుల ఆత్మగౌరవం, ప్రకృతి ప్రేమకు ప్రతీక అని పేర్కొన్నారు.
తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మ ద్వారా ప్రకృతిని పూజించే గొప్ప సంప్రదాయం తెలంగాణ సొంతమని, ఈ పండుగ రాష్ట్ర సంస్కృతికి గుర్తింపుగా నిలుస్తుందని ఆమె అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగను అధికారికంగా ప్రకటించి, ప్రతి సంవత్సరం ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరెలు పంపిణీ చేసిన విషయం గుర్తుచేశారు.
బతుకమ్మ పండుగలో పూలను దేవతగా పూజించడం, ప్రకృతిని ప్రేమించడం మన సంస్కృతిలో ఉన్న విశిష్టత అని తెలిపారు. జిల్లావాసులు సద్దుల బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుని, సాంప్రదాయాలకు ప్రతిష్ట తీసుకురావాలని యం. పద్మ దేవేందర్ రెడ్డి ఆకాంక్షించారు.








