మహారాష్ట్రలో బంజారా సోదరుల బంద్ – నిజామాబాద్ బంజారా సంఘం మద్దతు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రంలోని బంజారా సోదరులు మహారాష్ట్రలోని అన్ని జిల్లాల్లో ఈరోజు బంద్ కార్యక్రమం నిర్వహించారు. ఎస్టీ జాబితాలో భారతదేశవ్యాప్తంగా బంజారాలను చేర్చాలని, మహారాష్ట్రలో బీసీ కులం నుండి ఎస్టీ తెగల కులంలోకి మార్పు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బంజారా పిల్లల భవిష్యత్తు కోసం రిజర్వేషన్ అవసరమని బంజారా నాయకులు స్పష్టం చేశారు.

ఈ బంద్‌కు ఔరంగాబాద్–తుల్జాపూర్ హైవే వద్ద నిజామాబాద్ జిల్లా బంజారా సేవా సంఘం మద్దతు తెలిపింది. మద్దతు తెలిపిన వారిలో నిజామాబాద్ రూరల్ డివిజన్ అధ్యక్షులు బాధావత్ శంకర్ నాయక్, జిల్లా సంయుక్త కార్యదర్శి భానోత్ లక్ష్మణ్ నాయక్, సభ్యులు బానోత్ గోపాల్ నాయక్, భానోత్ శ్రీరామ్ నాయక్, బాదావత్ ప్రేమ్ దాస్ నాయక్, బానోత్ కృష్ణ తదితరులు ఉన్నారు.

బంజారా సంఘం నాయకులు “ఒకటే జాతి – ఒకటే రిజర్వేషన్ విధానం” కోసం తమ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment